రైతులకు అవసరమైన ఓ కీలక పరికరాన్ని వ్యవసాయ శాస్త్రవేత్తలు అందుబాటులోకి తీసుకొచ్చారు. పొలంలోనే కొన్ని నిమిషాల్లో మట్టిని పరీక్షించుకునేలా రూపొందించిన ఈ ఆవిష్కరణ సాగుకు ఎంతో ఉపయోగకరంగా మారింది. పంట దిగుబడిని పెంచేందుకు రసాయన ఎరువుల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో, వాటిని సమర్థంగా వినియోగించేందుకు ఐసీఏఆర్‌కు అనుబంధంగా ఉన్న భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ ‘సాయిల్ టెస్టింగ్ కిట్’ను ప్రవేశపెట్టింది. రైతులకు ప్రయోజనకరంగా ఉన్న ఈ కిట్లను తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి.


















