ప్రమాద స్థలంలో మంటలు భారీ ఎత్తున చెలరేగడంతో కోనసీమలో ఉద్రిక్తత నెలకొంది. ఆకాశమే హద్దుగా ఎగసిపడుతున్న మంటలను చూసి సమీప గ్రామస్తులు వణికిపోతున్నారు. పాత ఘటనలు కళ్లముందు కదలాడుతుండటంతో చాలామంది ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుండగా, సాంకేతిక బృందం గ్యాస్ లీకేజీని అరికట్టే పనిలో నిమగ్నమైంది. ప్రస్తుతానికి మంటల తీవ్రతను తగ్గించడంపైనే దృష్టి పెట్టామని అధికారులు వెల్లడించారు.



















