ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు గారు నేడు సందర్శించారు. హెలికాప్టర్‌లో ప్రాజెక్ట్ వద్దకు చేరుకున్న ఆయనకు అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి, పనుల పురోగతిని మ్యాప్‌ల ద్వారా అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ప్రాజెక్టులోని టన్నెల్స్ మరియు డయాఫ్రమ్ వాల్ పనులను స్వయంగా పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయడమే లక్ష్యమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.



















