ఒంగోలుకు చెందిన కళాకారిణి శ్రీలక్ష్మి ఒకే ఫ్రేమ్‌లో శ్రీకృష్ణుడి సంపూర్ణ జీవితగాథను అద్భుతంగా ఆవిష్కరించారు. కృష్ణుని జననం నుంచి అవతార సమాప్తం వరకు 72 కథలను చిన్న చిన్న మినియేచర్ చిత్రాలుగా తీర్చిదిద్దారు. ఆ సమస్త చిత్రాలను సమన్వయపరిచి ఒకే శ్రీకృష్ణుడి రూపంగా మలిచారు. ఈ కళాఖండానికి ‘కృష్ణం వందే జగద్గురుం’ అని పేరు పెట్టగా, దీనికి రెండు వరల్డ్ రికార్డులు లభించడం విశేషంగా నిలిచింది.




















