పండుగ సంబరాల కోసం సొంతూరు నారావారిపల్లెకు హెలికాప్టర్‌లో వెళ్తూనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధి పనులపై దృష్టి కొనసాగించారు. ఒడిలో ఫైల్స్, మదిలో రాష్ట్రాభివృద్ధితో ప్రయాణంలోనే కీలక అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్‌తో కలిసి బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్‌ను గగనతల పరిశీలన చేశారు. స్వదేశీ దర్శన్ 2.0 పథకం కింద సూర్యలంక అభివృద్ధికి కేంద్రం రూ.97 కోట్ల నిధులు మంజూరు చేయగా, షాపింగ్ స్ట్రీట్, ఇన్ఫర్మేషన్ బిల్డింగ్స్, ఎక్స్‌పీరియన్స్ జోన్‌లు, పార్కింగ్ వసతులు ఏర్పాటు చేయనున్నారు. ఈ చర్యలతో సూర్యలంక బీచ్ నవ్యాంధ్రలో ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా మారనుంది.


















