వినయ్ రత్నం దర్శకత్వంలో రూపొందుతున్న గ్రామీణ నేపథ్య చిత్రం ‘శ్రీ చిదంబరం గారు’ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ‘క’ సినిమా నిర్మాతలు వినీష్‌రెడ్డి, గోపాలకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టైటిల్ గ్లింప్స్‌తోనే మంచి స్పందన తెచ్చుకున్న ఈ మూవీలో తాజాగా విడుదలైన ఓ పాట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి స్వయంగా ఆలపించిన ‘వెళ్లే దారిలోన..’ పాటకు చందు, రవి సంగీతం అందించగా, చంద్రశేఖర్ హృద్యమైన సాహిత్యం రచించారు. ఈ చిత్రంలో వంశీ, సంధ్య, గోపినాథ్, శివకుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.



















