అమరావతి: ప్రముఖ పరకామణి కేసు విషయంలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుపై సీబీసీఐడీ అత్యవసరంగా విచారణ చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. డిసెంబర్ 2 నాటికి దర్యాప్తు పూర్తి చేసి నివేదిక సమర్పించాలని సూచించింది.
అలాగే, నిందితుడు రవికుమార్ ఆస్తులపై లోతుగా దర్యాప్తు చేయాలని ఏసీబీ డీజీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. లోక్ అదాలత్‌లో కేసు రాజీ చేసిన న్యాయమూర్తిపై కూడా చర్యలు తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది.
గత టీటీడీ ఛైర్మన్ మరియు సంబంధిత అధికారుల పాత్రపై సుదీర్ఘ విచారణ జరపాలని హైకోర్టు పేర్కొంది. కేసు తదుపరి విచారణను డిసెంబర్ 2కి వాయిదా వేసింది.
ఈ ఆదేశాలతో పరకామణి కేసు మళ్లీ చర్చనీయాంశంగా మారింది.



















