అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (హడ్కో) నుండి తీసుకున్న రుణాన్ని ముందుగానే తీర్చేందుకు ఏపీ టిడ్కోకు రూ.540 కోట్లు మంజూరు చేసింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి ఈ మొత్తాన్ని రుణంగా పరిగణిస్తూ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు పాలనాపరమైన అనుమతులతో కూడిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది.
ప్రభుత్వం నిర్ణయం మేరకు హడ్కో రుణాన్ని ముందుగా తీర్చడం ద్వారా వడ్డీ భారాన్ని తగ్గించడంతో పాటు టిడ్కో ఆర్థిక వ్యవస్థను మరింత బలపరచడమే లక్ష్యంగా ఉందని అధికారులు తెలిపారు. ఈ నిధుల వినియోగంపై అవసరమైన చర్యలు తీసుకోవాలని టిడ్కో మేనేజింగ్ డైరెక్టర్‌కు ప్రభుత్వం సూచనలు జారీ చేసింది.
ఈ చర్యతో రాష్ట్ర గృహ నిర్మాణ ప్రాజెక్టుల పురోగతికి వేగం వస్తుందని, రుణభారం తగ్గడం వల్ల భవిష్యత్తులో మరిన్ని గృహ పథకాలకు నిధులు సమకూరే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి.



















