ఈరోజు (13-01-2026)
శ్రమకు తగిన ఫలితాలు అందుతాయి. ఉద్యోగం, వ్యాపారాల్లో పెండింగ్ పనులను సమయానికి పూర్తి చేయడం వల్ల లక్ష్యసాధన సాధ్యమవుతుంది. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఆర్థికంగా స్థిరత్వం, బలం పెరుగుతాయి. విష్ణు దర్శనం శుభప్రదం.
ఈ వారం (11-01-2026 – 17-01-2026)
శుభకాలం కొనసాగుతోంది. లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే మంచి ఫలితాలు అందుతాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే మీ కృషికి సరైన గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉండి, ఉద్యోగంలో స్థిరత్వం పెరుగుతుంది. వ్యాపారంలో తీసుకునే సముచిత నిర్ణయాలు లాభదాయకంగా ఉంటాయి. కుటుంబంలో ఆనందం, ప్రశాంతత నెలకొంటాయి. శ్రీలక్ష్మీ అష్టోత్తరం స్మరణ మనసుకు శాంతిని ప్రసాదిస్తుంది.




















