బిహార్ అసెంబ్లీ ఎన్నికల హోరులో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) విడుదల చేసిన నివేదిక ప్రకారం రాష్ట్రంలో ఉన్న 241 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలలో 194 మంది కోటీశ్వరులు. వీరి మొత్తం ఆస్తులు రూ. 1,121 కోట్లు దాటాయి.
జేడీయూ ఎమ్మెల్యే నీలం దేవి రూ. 80 కోట్ల ఆస్తులతో అత్యంత సంపన్న ఎమ్మెల్యేగా, ఆర్జేడీ ఎమ్మెల్యే రామ్‌వృక్ష సదా రూ. 70 వేల ఆస్తులతో అత్యల్ప ఆస్తులు కలిగిన ఎమ్మెల్యేగా నిలిచారు.
పార్టీల వారీగా చూస్తే — బీజేపీ ఎమ్మెల్యేలలో 87%, ఆర్జేడీలో 88%, జేడీయూలో 83% మంది కోటీశ్వరులుగా ఉన్నారని ఏడీఆర్ తెలిపింది.
ఇక ఎన్నికల షెడ్యూల్ ప్రకారం బిహార్‌లో రెండు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి — నవంబర్ 6 మరియు 11 తేదీల్లో పోలింగ్, నవంబర్ 14న ఓట్ల లెక్కింపు జరగనుం




















