సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు పురోగతిపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా తీసుకుని పలు విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. అలాగే రాష్ట్రాభివృద్ధికి దోహదపడే అంశాలపై మంత్రులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.



















