హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి పై కేసు నమోదైంది. మంగళవారం జరిగిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సమయంలో ఆయన గందరగోళం సృష్టించారనే ఆరోపణలు వచ్చాయి. యూసుఫ్‌గూడలోని ఓ ఫంక్షన్‌హాల్లోకి పోలీసులు అడ్డుకున్నా వినకుండా కౌశిక్‌రెడ్డి తన అనుచరులతో బలవంతంగా వెళ్లారని ఫిర్యాదు అందింది. ఉద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారనే అభియోగంపై పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.




















