హైదరాబాద్ నగరం అంతర్జాతీయ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో కీలక కేంద్రంగా మారే దిశగా మరో ముందడుగు వేసింది. నెట్‌ఫ్లిక్స్‌కు చెందిన గ్లోబల్ ప్రొడక్షన్ అండ్ ఇన్నోవేషన్ సంస్థ ఐలైన్ స్టూడియోస్ హైదరాబాద్‌లో తన కొత్త కార్యాలయాన్ని ప్రారంభించింది. హైటెక్‌సిటీలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. నెట్‌ఫ్లిక్స్ హైదరాబాద్‌కు రావడం అంటే హాలీవుడ్ వచ్చినట్టేనని పేర్కొన్నారు. ప్రపంచ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో తెలంగాణ, భారత్ కీలక పాత్ర పోషించబోతున్నాయని చెప్పారు. ఇప్పటికే హైదరాబాద్ అనేక అంతర్జాతీయ కంపెనీలకు వేదికగా మారిందని, ప్రపంచంలోని 500 పెద్ద కంపెనీలను రాష్ట్రానికి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
తెలుగు సినిమా పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్‌కు రావడంలో ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, రామానాయుడు వంటి ప్రముఖుల పాత్ర ఎంతో గొప్పదని సీఎం గుర్తుచేశారు. ప్రస్తుతం బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్, కల్కి వంటి భారీ చిత్రాలతో తెలుగు సినిమా ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందిందన్నారు.నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఫ్యూచర్ సిటీలో తన కార్పొరేట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని సీఎం ఆహ్వానించారు. 30 వేల ఎకరాల్లో నిర్మించబోతున్న ఫ్యూచర్ సిటీలో విస్తరణ కోసం అవసరమైన భూమిని ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.
ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ (AVGC) రంగాల్లో హైదరాబాద్‌ను గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. నెట్‌ఫ్లిక్స్ రాకతో తెలంగాణ కథలు, సంస్కృతి ప్రపంచ ప్రేక్షకులకు చేరే అవకాశముందని చెప్పారు.
నెట్‌ఫ్లిక్స్‌కు చెందిన ఐలైన్ స్టూడియోస్ ప్రపంచవ్యాప్తంగా లాస్ ఏంజెలెస్, వాంకోవర్, సియోల్, లండన్ నగరాల్లో ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇప్పుడు హైదరాబాద్‌లో ప్రారంభమైన ఈ ఐదో కేంద్రం అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్ టెక్నాలజీతో పనిచేయనుంది.ఈ కేంద్రం ద్వారా యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ వంటి సృజనాత్మక సాంకేతిక రంగాల్లో తెలంగాణ యువతకు కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews


















