ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఘర్షణలు సంభవించాయి. బీజాపూర్ పరిధిలోని నేషనల్ పార్క్ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టులను చుట్టుముట్టడంతో ఇరు వైపుల మధ్య తీవ్ర కాల్పులు జరిగినట్లు తెలిసింది. ఈ ఘర్షణల్లో కొంతమంది మావోయిస్టు నేతలు ప్రాణాలు కోల్పోయారనూ సమాచారం వస్తోంది. పూర్తి వివరాలు ఇంకా రాలేదు.




















