చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురం సమీపంలో శ్రీవారి మెట్టు మార్గంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. నడక మార్గంలోని 450వ మెట్టు వద్ద భక్తులు చిరుతను చూశారు. అప్రమత్తమైన అధికారులు ఉదయం రెండు గంటల పాటు మెట్టు మార్గంలో భక్తుల రాకపోకను నిలిపేశారు. ఉదయం 8 గంటల నుంచి భక్తులను గుంపులుగా పంపిస్తున్నారు. పిల్లలు ఉన్న భక్తులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. చిరుత కోసం అటవీ శాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.



















