జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ సమీపంలోని ఫ్లెడ్‌బెర్గ్ పర్వతాలపై మనోహరమైన దృశ్యం కనబడుతోంది. ఈ ప్రాంతంలో తరచుగా దట్టమైన పొగమంచు, మేఘాలు కురి కురి కనువిందుగా మలుస్తాయి. సోమవారం భవనాలు, ఇతర నిర్మాణాలు పొగమంచులో మసకబారినట్లుగా దర్శనమిచ్చాయి. సాధారణంగా వర్షాకాలంలో నేలపై సూర్యకాంతి కనిపించకపోయినప్పటికీ, విమానంలో ప్రయాణిస్తున్నవారికి అద్దంలో నుంచి చూస్తే కిందపక్కన మేఘాల సముద్రం, ఎదురుగా సూర్యుడు కనిపిస్తూ ఒక వేరే ప్రపంచాన్నే అవిష్కరిస్తుంది. ఫ్లెడ్‌బెర్గ్ పర్వతాల్లో నివసిస్తున్నవారికి మాత్రం ఇలాంటి దృశ్యాలు వారి ఇంటి నుండి నిత్యం కనువిందుగా ఉంటాయి అని తెలుస్తోంది.




















