పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు భారీగా పెరిగాయి. ఈ పరిస్థితి రష్యాకు అనుకూలంగా మారింది. పెరిగిన ధరలతో రష్యా చమురు విక్రయాల ద్వారా భారీ ఆదాయం పొందుతున్నట్లు అంతర్జాతీయ మీడియా నివేదికలు వెల్లడిస్తున్నాయి.
ఇప్పటికే నౌకల్లో లోడ్ చేసిన చమురుపై అమెరికా ప్రభుత్వం కొన్ని ఆంక్షలను తాత్కాలికంగా సడలించింది. అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్ ప్రకటన ప్రకారం ఇప్పటికే రవాణాకు సిద్ధంగా ఉన్న చమురు కొనుగోళ్లకు మాత్రమే ఈ నిర్ణయం వర్తిస్తుందని తెలిపింది. ఈ చర్య అంతర్జాతీయ ఇంధన మార్కెట్లలో స్థిరత్వం కోసం తీసుకున్నదని ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ తెలిపారు.
అమెరికా ఆంక్షల సడలింపుతో ప్రస్తుతం రష్యాకు చెందిన 30 ట్యాంకర్లలోని చమురు మార్కెట్‌లోకి రావడానికి సిద్ధంగా ఉంది. వీటిలో సుమారు 19 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు, 3,10,000 టన్నుల రిఫైన్డ్ ఉత్పత్తులు ఉన్నాయి. యుద్ధం కారణంగా చమురు ధరలు పెరగడం రష్యాకు భారీ లాభాలను తెచ్చిపెడుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా కూడా ఈ యుద్ధంలో లాభపడుతున్నది రష్యానే అని వ్యాఖ్యానించారు.
అమెరికా సెనెట్ సాయుధ సేవల కమిటీ విచారణలో యూఎస్ సెనెటర్ ఆంగస్ కింగ్ మాట్లాడుతూ.. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యా దాదాపు 6 బిలియన్ డాలర్ల అదనపు ఆదాయాన్ని సంపాదించిందని తెలిపారు. రోజుకు సుమారు 400 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.3,700 కోట్లు) అదనంగా రష్యా ఆదాయం పొందుతోందని అంచనా వేశారు.ప్రపంచ రాజకీయ, ఆర్థిక పరిణామాల్లో ఈ యుద్ధం ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో ఈ పరిణామాలు స్పష్టంగా చూపిస్తున్నాయి.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















