తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా జరిగిన భారీ కుట్రను తిరుపతి పోలీసులు ఛేదించారు. తిరుమలలో మద్యం సీసాలు దొరికాయని సామాజిక మాధ్యమాల్లో జరిగిన ప్రచారం వెనుక పక్కా కుట్ర ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ప్రభుత్వాన్ని, టీటీడీని, పోలీసు వ్యవస్థను అపఖ్యాతి పాలుచేయాలనే ఉద్దేశంతో బయట నుంచి ఖాళీ మద్యం సీసాలు తెచ్చి తిరుమలలో పడేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేయగా, మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. కుట్రకు సంబంధించిన కీలక సీసీటీవీ దృశ్యాలను పోలీసులు విడుదల చేశారు.



















