తులసి ఆకులను అనేక తీవ్రమైన వ్యాధులకు కూడా ఔషధంగా ఉపయోగిస్తారని అందరికీ తెలిసిందే. కానీ, తులసి మొక్క కాండాలకు కూడా అనేక ఔషధ గుణాలు ఉన్నాయని మీకు తెలుసా?
ఇంటర్నెట్ డెస్క్: తులసి మొక్క లేని ఇంటిని చూడటం చాలా అరుదు. మతపరమైన కారణాల వల్లనే కాదు, దాని ఔషధ గుణాల కారణంగా కూడా, తులసి మొక్కలను అందరి ఇళ్లలో పెంచుతారు. తులసి ఆకులు జలుబు, దగ్గుకు మాత్రమే కాకుండా అనేక తీవ్రమైన వ్యాధులకు కూడా దివ్యౌషధం. ఇది అందరికీ తెలిసిన విషయమే… కానీ, ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే తులసి ఆకులు, గింజలు మాత్రమే కాకుండా, తులసి కాండం కూడా అనేక ఔషధ గుణాలను కలిగి ఉంది. తులసి కాండంను నీటిలో మరిగించి, కషాయం తయారు చేసి తినడం ద్వారా లెక్కలేనన్ని ప్రయోజనాలను పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, తులసి కాండం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
తులసి ఆకుల రసం రోజూ తీసుకోవడం వల్ల అనేక తీవ్రమైన వ్యాధులను నివారించవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇది ఒత్తిడి, నిరాశ వంటి సమస్యల నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. తులసి ఆకులను రోజూ నమలడం వల్ల కార్టిసాల్ హార్మోన్ల స్రావం తగ్గుతుంది, ఇది ఒత్తిడి, అధిక కోపాన్ని తగ్గిస్తుంది. తులసి టీ లేదా కషాయాలను తాగడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది. ఇది తులసి ప్రయోజనాల్లో ఒకటి. దాని కాండంలో మరిన్ని ప్రయోజనాలు ఉన్నాయి.
తులసి కాండం ప్రయోజనాలు
ఔషధ గుణాలు కలిగిన తులసి కాండాల కషాయం శరీర రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. జలుబు, దగ్గు, జ్వరం, సైనస్ సమస్యల వంటి శ్వాసకోశ వ్యాధులకు ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది. తులసి కాండం కషాయం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, ఆకలిని పెంచుతుంది, జీవక్రియను పెంచుతుంది, మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. ప్రతికూల శక్తుల నుండి రక్షించడంలో కూడా సహాయపడుతుంది. తులసి ఆకుల కషాయం శరీరాన్ని బ్యాక్టీరియా, వైరస్‌ల వంటి ఇన్ఫెక్షన్‌ల నుండి రక్షించే గుణాన్ని కూడా కలిగి ఉంటుంది.




















