ఇప్పటి జీవనశైలిలో శబ్ద కాలుష్యం పెద్ద ముప్పుగా మారింది. నైట్‌క్లబ్బులు, పబ్బులు, డిస్కోథెక్‌లు, సినిమా హాళ్లు, క్రీడా స్టేడియాలు, జిమ్‌లు, రద్దీ రోడ్లు—ఎక్కడ చూసినా శ్రుతిమించిన శబ్దాలే. ఇవి చాలనట్టు స్మార్ట్‌ఫోన్లు, ఇయర్‌ఫోన్స్, బడ్స్, ఆన్‌లైన్ గేమ్స్, ఓటీటీ వినోదం… ఇవన్నీ కలిసి వినికిడిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకుపైగా మందికి వినికిడి లోపం ముప్పు పొంచి ఉంది. ముఖ్యంగా 12-35 ఏళ్ల వయసువారిలో ప్రమాదకర స్థాయి శబ్దాలకు గురయ్యే వారి సంఖ్య పెరుగుతోంది. మొబైల్ ఫోన్లలో 70-100% వాల్యూమ్‌తో గంటల కొద్దీ వినడం వల్ల 90 డెసిబెల్స్ కంటే ఎక్కువ శబ్ద తీవ్రత చెవులపై పడుతోంది.
శబ్దాల స్థాయిలు – ఎంతవరకు సురక్షితం?
- 80 డెసిబెల్స్ లోపు – సురక్షితం
- 85 డెసిబెల్స్ – 8 గంటల వరకే
- 95 డెసిబెల్స్ – 1 గంట మాత్రమే
- 100 డెసిబెల్స్ – 15 నిమిషాలకే ప్రమాదం
- 110 డెసిబెల్స్ పైగా – తక్షణ ముప్పు
ట్రాఫిక్ రద్దీ, లౌడ్‌స్పీకర్లు, డీజేలు, బాణసంచా, రైలు హారన్‌లు వంటి శబ్దాలు చెవుల్లోని సున్నితమైన రోమకణాలను దెబ్బతీస్తాయి. ఒకసారి ఇవి నాశనం అయితే తిరిగి పెరగవు.
తొలి హెచ్చరిక సంకేతాలు
- తరచూ “మరొసారి చెప్పండి” అని అడగటం
- పెద్ద శబ్దం తర్వాత చెవి దిబ్బడేసినట్టు అనిపించడం
- ఫోన్ వాడిన తర్వాత చెవిలో మోగినట్టు ఉండటం
- టీవీ/మొబైల్ వాల్యూమ్‌ను పెంచడం
ఇవి వినికిడి లోపానికి ముందస్తు హెచ్చరికలు.
ప్రమాదం ఎలా జరుగుతుంది?
శబ్ద తరంగాలు చెవి ద్వారా లోపలికి వెళ్లి మధ్య చెవిలోని కర్ణభేరిని కంపింపజేస్తాయి. ఆ తరంగాలు లోపలి చెవిలోని కాక్లియాకు చేరి అక్కడి రోమకణాలను ఉత్తేజితం చేస్తాయి. ఇవే శబ్దాన్ని మెదడుకు చేరుస్తాయి. భారీ శబ్దాల వల్ల ఈ రోమకణాలు శాశ్వతంగా దెబ్బతింటే వినికిడి కోల్పోతాం. ముఖ్యంగా ఈ కణాలు తిరిగి వృద్ధి చెందవు.
సాధ్యమైన పరిష్కారాలు
- వినికిడి సాధనాలు: 30-70 డెసిబెల్స్ లోపం ఉన్నవారికి ఉపయోగం
- కాక్లియర్ ఇంప్లాంట్: 80-120 డెసిబెల్స్ తీవ్ర లోపం ఉన్నవారికి
ఇప్పుడున్న స్మార్ట్ ఇంప్లాంట్లు, ఏఐ ఆధారిత వినికిడి పరికరాలు పరిసర శబ్దాలను గుర్తించి సర్దుబాటు చేసుకుంటాయి.
నివారణ చిట్కాలు
- 60-60 నియమం పాటించాలి (60% వాల్యూమ్, 60 నిమిషాల పరిమితి)
- నాణ్యమైన హెడ్‌ఫోన్స్ వాడాలి
- నాయిస్ క్యాన్సెలింగ్ ఇయర్‌ఫోన్స్‌ను దీర్ఘకాలం వాడొద్దు
- రద్దీ ప్రదేశాల్లో సంగీతం వినటం మానేయాలి
- అధిక శబ్దాలున్నచోట ఇయర్‌ప్లగ్స్ వాడాలి
- తరచూ వినికిడి పరీక్ష చేయించుకోవాలి
అదృశ్య అనర్థం
వినికిడి లోపం కంటికి కనిపించదు. అయితే అది సంభాషణ, చదువు, భావోద్వేగ నియంత్రణపై ప్రభావం చూపేంతవరకు నెమ్మదిగా పెరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో సుమారు 7% మంది వినికిడి లోపంతో బాధపడుతున్నారని అంచనా. 2030-40 నాటికి ఇది 10-12% వరకు పెరిగే ప్రమాదం ఉంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు వంటి పట్టణాల్లో శబ్ద స్థాయిలు తరచూ 70-90 డెసిబెల్స్‌ను మించుతున్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews APPolitics Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder Movies News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PoliticalUpdate PublicSafety shivasakthi ShivasakthiDigital shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews ShivaShaktiUpdates SportsNews Telangana TelanganaNews TeluguNews TrendingNow ViralNews WorldNews



















