రంగంపేట: దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా దుర్గమ్మ ప్రతిరూపాన్ని ఓ సైకత శిల్పి వినూత్నంగా రూపొందించారు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేటకు చెందిన దీవెన శ్రీనివాస్.. ఏటా ఇసుకతో బొమ్మలను తయారు చేస్తుంటారు. అయితే ఈసారి ప్రత్యేకంగా డ్రైఫ్రూట్స్, మసాలాలతో అమ్మవారి చిత్రాన్ని తీర్చిదిద్దారు. స్థానికులను ఇది ఆకట్టుకుంటోంది.
















