కుక్కను బెదిరించాడన్న కోపంతో తండ్రీకొడుకులు ఓ బాలుడిపై దాడిచేశారు. ఈ సంఘటన సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దిల్‌సుఖ్‌నగర్ కోదండరాంనగర్ కాలనీకి చెందిన దాసరి సాయి(17) ఆదివారం రాత్రి 9.30 గంటలకు కర్రీ పాయింట్‌కు నడుచుకుంటూ వెళ్తున్నాడు.
హైదరాబాద్: కుక్కను బెదిరించాడన్న కోపంతో తండ్రీకొడుకులు ఓ బాలుడిపై దాడిచేశారు. ఈ సంఘటన సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దిల్‌సుఖ్‌నగర్ కోదండరాంనగర్ కాలనీ(Dilsukhnagar Kodandaramnagar Colony)కి చెందిన దాసరి సాయి(17) ఆదివారం రాత్రి 9.30 గంటలకు కర్రీ పాయింట్‌కు నడుచుకుంటూ వెళ్తున్నాడు. దారిలో లంక లక్ష్మీనారాయణ ఇంటి ఎదుటి నుంచి వెళ్తుండగా ఆ ఇంట్లో ఉన్న కుక్క సాయిని చూసి మొరిగింది. దీంతో రాయి చూపించి కుక్కను బెదిరించి వెళ్లిపోయాడు.
సాయి కర్రీ తీసుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా లక్ష్మీనారాయణ(Lakshminarayana), అతడి కుమారుడు శివనారాయణ మూర్తి తమ కుక్కను బెదిరిస్తావా అంటూ సాయిపై దాడిచేశారు. కర్రతో కొట్టడంతో బాలుడి మెడ, ఎడమ చేయిపై గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. తమ కుమారుడిపై దాడి చేసిన తండ్రీకొడుకులపై చర్యలు తీసుకోవాలని సాయి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.




















