జగన్ డైరక్షన్ లోనే అంబేద్కర్ విగ్రహంపై దాడి
జగన్ అండదండలు లేకుండా ఇవాళ చిత్తురు జిల్లాలో అంబేద్కర్ విగ్రహంపై దాడి జరగదని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కావలి ప్రతిభా భారతీ అన్నారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడిన ఆమె.. వైసీపీ నాయకులు నవ భారత రాజ్యంగ నిర్మాత అంబేద్కర్ పై దాడి చేశారని మండిపడ్డారు. సీసీ కెమెరా, ఫోన్ లోకేషన్, ఫోన్ కాల్స్ ఆధారంగా అంబేద్కర్ విగ్రహాన్ని కాల్చివేసింది వైసీపీ నాయకులని అర్ధమౌవుతుందన్నారు. భారతీయులందరూ భగవంతునిలా ఆరాధించే డా. బీఆర్ అంబేద్కర్ గారికి వైసీపీ నాయకులు అవమానం చేశారని మండిపడ్డారు. స్థానిక సర్పంచ్ గోవిందయ్య ఆధ్వర్యంలో ఈ దాడి జరిగిందని ఆరోపించారు. పక్క ప్రణాళికతో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టి రాజకీయం చేయాలనుకున్నారని ప్రతిభా భారతీ ఆరోపించారు. ఆ కుట్రను టీడీపీ వాళ్లపై నెట్టి రాజకీయ లబ్ధిపొందాలని చూశారన్నారు. సర్పంచ్ గోవిందయ్య చరిత్ర అవినీతితో కూడికుందన్నారు. గతంలో రూ.30లక్షల పంచాయతీ నిధులు దుర్వినియోగం చేసినట్లు ఆరోపించారు. కలెక్టర్ గారు సర్పంచ్ చెక్ పవర్ రద్దు చేసినట్లు గుర్తు చేశారు. మాజీ డిప్యూటీ సీఎం వెంకట స్వామీ అనుచరునిగా గోవిందయ్య ఇసుక దందా చేశారన్నారు. ఇవాళ అంబేద్కర్ విగ్రహంపై దాడి చేసిన వారిని పోలీసులు అరెస్టు చేస్తే.. నింధుతులతో వైసీపీ పార్టీకి సంబంధం లేదని జగన్మోహన్ రెడ్డి ప్రకటించక పోవడం బాధకరమన్నారు. అంబేద్కర్ పై లేని గౌరవం.. జగన్మోహన్ రెడ్డికి దళితులపై ఎలా ఉంటుందని ప్రశ్నించారు. దళితుడైనా సింగయ్యపై జగన్ కారు ఎక్కించి తొక్కించాడని గుర్తు చేశారు. మాస్క్ అడిగిన డాక్టర్ సుధాకర్ గారిని వేధించి చంపారని మండిపడ్డారు. వైసీపీ హయంలో దళితుడైన డ్రైవర్ సుధాకర్ ను హత్య చేసి ఎమ్మెల్సీ అనంత బాబు డోర్ డెలవరీ చేస్తే జగన్ సన్మానం చేశారన్నారు. అంబేద్కర్ విగ్రహంపై వైసీపీ నాయకులు చేసిన దాడిని దళిత, ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండించాలని ప్రతిభా భారతీ కోరారు.


















