గురువారం ప్రత్యేక గ్రహం : గురు గ్రహం (Jupiter)
గురు గ్రహం అనేది : జ్ఞానం, ధర్మం, బుద్ధి, ఆధ్యాత్మికత, గురుత్వం, శ్రేయస్సు మరియు సంపదల గ్రహం.
గురు అనేది గురువులలో గురువు — శ్రేయోమార్గం చూపించే శక్తిగా భావిస్తారు.
గురువు రంగు : పసుపు (Yellow)
గురువు అధిపతిగా : ధనుస్సు రాశి, మీన రాశి.
గురువు పాలకుడు : విద్య, జ్ఞానం, ధర్మం, సత్యం, న్యాయం మరియు మతపరమైన ఆచారాల కర్త.
గురువారం ప్రత్యేక దైవం :
గురువారం గురుగ్రహాన్ని, సాయిబాబాను పూజించాలి.సాయిబాబాను పూజించే వారు గురువారం పాల పదార్థాలతో నైవేద్యం సమర్పించాలి.పసుపు రంగు వస్త్రాలను దానం చేయడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి.
స్తోత్రం:
శిరిడీవాసా సాయిప్రభో జగతికి మూలం నీవే ప్రభో
దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం
తాత్పర్యం :
ఓ శిరిడీ వాసుడా సాయినాథా! ఈ జగత్తుకి మూలకారణం నీవే ప్రభూ. నీవు స్వయంగా శ్రీ దత్తాత్రేయ స్వామివారి అవతారమైనావు. ఈ సృష్టి స్థితి లయ వ్యవహార అంతా నీలోనే నడుస్తున్నాయి.




















