హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్‌పై విచారణను హైకోర్టు జనవరి రెండో వారానికి వాయిదా వేసింది. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయడానికి 4 వారాల గడువు ఇచ్చింది. ప్రభుత్వ కౌంటర్‌కు సమాధానం ఇచ్చేందుకు పిటిషనర్లకు మరో 3 వారాలు గడువు ఇచ్చింది. కేసీఆర్‌తోపాటు హరీశ్‌రావు, స్మితా సబర్వాల్, ఎస్‌కే జోషికి 3 వారాల గడువు ఇచ్చిన ఉన్నత న్యాయస్థానం.. అప్పటివరకు మధ్యంతర ఉత్తర్వులు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాళేశ్వరం కమిషన్ ఆధారంగా చర్యలు తీసుకోవద్దని గతంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే.


















