విజయవాడ : కృష్ణానదిపై ఉన్న ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రస్తుతం బ్యారేజీకి 1.51 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదైంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మున్నేరు నుంచి కూడా భారీగా వరద నీరు చేరుతోంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ నీటిమట్టం 10 అడుగులుగా ఉంది.
వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఇవాళ సాయంత్రానికి వరద ఇన్‌ఫ్లో 6 లక్షల క్యూసెక్కుల వరకూ చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనితో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని విపత్తు నిర్వహణ శాఖ సూచించింది.
అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ, వరద ఉధృతి పెరిగినపుడు అవసరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు.



















