పథనంథిట్ట: కేరళ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం ప్రసిద్ధ శబరిమల ఆలయాన్ని దర్శించారు. అయితే, ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో హెలిప్యాడ్ అకస్మాత్తుగా కుంగిపోవడంతో ఆందోళన నెలకొంది. అదృష్టవశాత్తు, రాష్ట్రపతికి ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు స్పష్టంచేశారు.




















