ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

కార్తీక పురాణం-1వ అధ్యాయం

October 22, 2025
in Devotional News
0
కార్తీక మాస మహత్యం: మొదటి రోజు కథ
Share on FacebookShare on TwitterShare on Whatsapp

శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండమునందలి ఆర్యావర్తమందు నైమిశారణ్యములో శౌనకాది మహామునులతో నొక ఆశ్రమమును నిర్మించుకొని సకల పురాణములు, పుణ్య చరిత్రలు వారికి వినిపించుచూ సూతమహాముని కాలం గడుపుచుండెను.

ఒకనాడు శౌనకాది మునులు గురుతుల్యుడగు సూతుని గాంచి, ‘ఆర్యా ! తమ వలన అనేక పురాణేతిహాసములను, వేదవేదాంగ రహస్యములను సంగ్రహముగా గ్రహించినారము.

కార్తీక మాస మహత్యమును కూడా వివరించి, దాని ఫలమును తెలుపగోరుచుంటిమి గాన తమరా వ్రతమును వివరించవలసినది అని కోరిరి.

అంత నా సూతమహర్షి, ‘ఓ ముని పుంగవులారా ! ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయగు బ్రహ్మను కోరుకొనగా బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి లక్ష్మీ దేవికి, సాంబశివుడు పార్వతీ దేవికీ తెలియజేసిన విధముగా నా గాథను వినిపించెను.

అట్టి పురాణ కథను మీకు తెలియజేయుదును. ఈ కథను వినుటవలన మానవులకు ధర్మార్ధములు కలుగటయే గాక, వారు యిహమందును, పరమందును, సకలైశ్వర్యములతో తులతూగుదురు. కావున శ్రద్ధగా నాలకింపుడని యిట్లు చెప్పెను.

పూర్వము ఒకానొక దినంబున పార్వతీ పరమేశ్వరులు గగనంబున విహరించుచుండగా పార్వతీ దేవి, ‘ప్రాణేశ్వరా సకలైశ్వర్యములు కలుగజేయునట్టిది, సకల మానవులు వర్ణభేదములు లేక ఆచరించదగినది,

శాస్త్ర సమ్మతమైనది, సూర్యచంద్రులున్నంత వరకు ఆచరింపబడేది యగు వ్రతము’ను వివరింపుడని కోరెను.అంతట మహేశ్వరుడు మందహాస మొనరించి. ‘దేవీ!’ నీవు అడుగుచున్న వ్రతము స్కాందపురాణమున చెప్పబడియున్నది.

దానినిప్పుడు వశిష్ట మహాముని మిథిలాధీశుడగు జనక మహారాజునకు వివరింపబోవుచున్నాడు. చూడుమా మిథిలా నగరము వైపూ, అని మిథిలా నగరపు దిశగా చూపించెను .అట, మిథిలా నగరములో వశిష్టుని రాకకు జనకుడు సంతసించి అర్ఘ్యపాద్యములతో సత్కరించి, కాళ్ళు కడిగి, ఆ జలమును శిరస్సుపై జల్లుకొని ‘మహాయోగీ! మునివర్యా! తమ రాక వల్ల నేను

, నా శరీరము, నా దేశము, నా ప్రజలు పవిత్రులమైతిమి. తమ పాద ధూళీ చే నా దేహము పవిత్రమైనది. తమ రిటకేల వచ్చితిరో సెలవొసంగుడూ, అని వేడుకొనెను.

అందులకు వశిష్టుడు ‘జనక మహారాజా! నేనొక మహాయజ్ణ్జము చేయతలపెట్టితిని.

దానికి కావలసిన అర్ధ బలమును, అంగ బలము నిన్నడిగి క్రతువు ప్రారంభించవలెనని నిశ్చయించి యిటువచ్చితినీ, అని పలుకగా, జనకుడు, ‘ముని చంద్రమా! అటులనే యిత్తును. స్వీకరింపుడు. కానీ – చిరకాలము నుండి నాకొక సందేహము కలదు.

తమబోటి దైవజ్ణ్జులనడిగి సంశయమును తీర్చుకోదలిచితిని. నాయదృష్టము కొలది ఈ అవకాశము దొరికినది. గురు రత్నా! సంవత్సరములో కల మాసములలో కార్తీక మాసమే ఏలనంత పవిత్రమైనది? ఆ కార్తీక మాస గొప్పతనమేమి? అను సంశయము నాకు చాలా కాలము నుండి యున్నది.

కావున తాము కార్తీక మహత్మ్యము గురించి వివరింపవలసినదీ, అని ప్రార్థించెను.

వశిష్ట మహాముని చిరునవ్వు నవ్వి ‘రాజా! తప్పక నీ సంశయమును తీర్చగలను. నే చెప్పబోయే వ్రత కథ సకల మానవులు ఆచరించదగినది.

సకల పాపహరమైనది అయివున్నది. ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము. ఈ మాసమునందాచరించు వ్రతము యొక్క ఫలమింతని చెప్పనలవి కాదు. వినుటకు గూడా ఆనందదాయకమైనది.

అంతియే గాక వినినంత మాత్రమునే ఎట్టి నరక బాధలు లేక యిహమందును, పరమందును, సౌఖ్యమును పొందగలరు, నీబోటి సజ్జనులు యీ కథను అడిగి తెలుసుకొనుట ఉత్తమమైనది. శ్రద్ధగా ఆలకింపుమని యిట్లు చెప్పసాగెను.

వశిష్టుడు కార్తీక వ్రత విధానము తెలుపుట

ఓ మిథిలాధీశ్వరా! జనక మహారాజా! ఏ మానవుడైనను, ఏ వయసు వాడైనను, ఉచ్చ నీచ అనే భేదము లేక కార్తీక మాసములో, సూర్య భగవానుడు తులారాశియందుండగా, వేకువ జామున లేచి కాలకృత్యములను తీర్చుకొని,

స్నానమాచరించి, దానధర్మములను, దేవతా పూజలను చేసినచో దాని వలన అగణిత పుణ్యఫలము లభించును. కార్తీక మాస ప్రారంభము నుండియు యిట్లు చేయుచూ శివలింగార్చన ,

విష్ణుసహస్ర నామార్చన, ఆచరించుచుండవలెను.

ముందుగా కార్తీక మాసమునకు ఆధిదేవతయగు దామోదరునికి నమస్కరించి, ‘ఓ దామోదరా! నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానీయక నన్ను కాపాడుమూ, అని ధ్యానించి, వ్రతమును ప్రారంభించవలెను.

కార్తీక స్నాన విధానము

‘ఓ రాజా! ఈ వ్రతమాచరించు దినములలో సూర్యోదయమునకు పూర్వమే లేచి, కాలకృత్యములు తీర్చుకొని, నదికి బోయి స్నానమాచరించి గంగకు, శ్రీమన్నారాయణునకు, పరమేశ్వరునకు, భైరవునకు, నమస్కరించి, సంకల్పము చెప్పుకొని, మరలా నీట మునిగి సూర్య భగవానునకు అర్ఘ్యప్రదాన మొసంగి, పితృదేవతలకు క్రమ ప్రకారముగా తర్పణములొనర్చి గట్టుపై మూడు దోసిళ్ళ నీళ్ళు పోయవలెను.

ఈ కార్తీక మాసములో పుణ్య నదులైన గంగ, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున, మున్నగు నదులలో ఏ ఒక్క నదిలోనైననూ స్నానమాచరించిన యెడల గొప్ప ఫలము కలుగును.

తడి బట్టలు వీడి, మడి బట్టలు కట్టుకొని, శ్రీమహావిష్ణువుకు ప్రీతి కరమైన పుష్పములను తానే కోసితెచ్చి నిత్య ధూప, దీప, నైవేద్యములతో భగవంతునికి పూజ చేసి, గంధము తీసి భగవంతునికి సమర్పించి, తాను బొట్టు పెట్టుకొని, పిమ్మట అతిధి అభ్యాగతులను పూజించి, వారికి ప్రసాదమిడి, తన ఇంటి వద్ద కానీ, దేవాలయములో కానీ, లేక రావిచెట్టు మొదట కానీ కూర్చుండి కార్తీక పురాణమును చదువవలయును.

ఆ సాయంకాలము సంధ్యావందనము ఆచరించి. శివాలయమందు కానీ, విష్ణ్వాలయమందు కానీ, లేక తులసి తోట వద్ద కానీ, దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యమును తయారు చేయించి స్వామికి సమర్పించి, అందరికీ పంచిపెట్టి, తర్వాత తాను భుజింపవలెను. మరునాడు మౄష్టాన్నముతో భూత తౄప్తి చేయవలయును.

ఈ విధముగా వ్రతమాచరించిన స్త్రీ, పురుషులకు పూర్వమందును, ప్రస్తుత జన్మమందును చేసిన పాపము పోయి మోక్షమునకు అర్హులగుదురు. ఈ వ్రతము చేయుటకు అవకాశము లేని వారు, వ్రతము చేసిన వారలను జూచి, వారికి నమస్కరించినచో వారికి కూడా తత్సమాన ఫలము దక్కును.

ప్రథమాధ్యాయం మొదటి రోజు పారాయణము సమాప్తము….

-స్వస్తి……….

ShareTweetSend
Previous Post

మహిళా సాధికారతపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష – డ్వాక్రా, మెప్మా కార్యక్రమాలపై దృష్టి

Next Post

రాష్ట్రపతి ముర్ము హెలికాప్టర్ ల్యాండింగ్‌లో డ్రామా – కుంగిన హెలిప్యాడ్‌తో కలకలం

Related Posts

పంచాంగం: 21 జూన్ 2026 (ఆదివారం)
Rasi Phalalu

పంచాంగం: 21 జూన్ 2026 (ఆదివారం)

June 21, 2026
దానాల్లో జాగ్రత్తలు: అపాత్ర దానం వల్ల కలిగే దుష్పరిణామాలు మరియు సరైన దాన ధర్మాల ప్రాముఖ్యత
Devotional News

దానాల్లో జాగ్రత్తలు: అపాత్ర దానం వల్ల కలిగే దుష్పరిణామాలు మరియు సరైన దాన ధర్మాల ప్రాముఖ్యత

June 20, 2026
ఆదియోగి పతంజలి మహర్షి చరిత్ర: యోగ పితామహుడి జీవిత విశేషాలు మరియు బోధనలు
Devotional News

ఆదియోగి పతంజలి మహర్షి చరిత్ర: యోగ పితామహుడి జీవిత విశేషాలు మరియు బోధనలు

June 20, 2026
జ్యేష్ఠ లక్ష్మి (అలక్ష్మి) ఎవరు? ఆమె నివాస స్థలాలు, పురాణ విశేషాలు
Devotional News

జ్యేష్ఠ లక్ష్మి (అలక్ష్మి) ఎవరు? ఆమె నివాస స్థలాలు, పురాణ విశేషాలు

June 19, 2026
అక్కమహాదేవి: శ్రీశైలం గుహలో తపస్సు చేసిన మహాభక్తురాలి కథ
Devotional News

అక్కమహాదేవి: శ్రీశైలం గుహలో తపస్సు చేసిన మహాభక్తురాలి కథ

June 19, 2026
తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 10 గంటల సమయం
Devotional News

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 10 గంటల సమయం

June 18, 2026
Next Post
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

June 21, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 17 జూన్ 2026 (బుధవారం)

పంచాంగం: 17 జూన్ 2026 (బుధవారం)

June 17, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

June 21, 2026
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
International Yoga Day

International Yoga Day

June 21, 2026
పంచాంగం: 21 జూన్ 2026 (ఆదివారం)

పంచాంగం: 21 జూన్ 2026 (ఆదివారం)

June 21, 2026
ఎండాకాలంలో పర్వతం మీద అత్తమామల ఇల్లు

ఎండాకాలంలో పర్వతం మీద అత్తమామల ఇల్లు

June 20, 2026
ఎండాకాలంలో చల్లని కుండ గ్రామం

ఎండాకాలంలో చల్లని కుండ గ్రామం

June 20, 2026

Recent News

International Yoga Day

International Yoga Day

June 21, 2026
పంచాంగం: 21 జూన్ 2026 (ఆదివారం)

పంచాంగం: 21 జూన్ 2026 (ఆదివారం)

June 21, 2026
ఎండాకాలంలో పర్వతం మీద అత్తమామల ఇల్లు

ఎండాకాలంలో పర్వతం మీద అత్తమామల ఇల్లు

June 20, 2026
ఎండాకాలంలో చల్లని కుండ గ్రామం

ఎండాకాలంలో చల్లని కుండ గ్రామం

June 20, 2026
ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Bussiness news
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

International Yoga Day

International Yoga Day

June 21, 2026
పంచాంగం: 21 జూన్ 2026 (ఆదివారం)

పంచాంగం: 21 జూన్ 2026 (ఆదివారం)

June 21, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.