హైదరాబాద్: పెద్ద అంబర్‌పేట్ ఓటర్ రింగ్ రోడ్ జంక్షన్ వద్ద ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. మియాపూర్ నుంచి గుంటూరు వెళ్తున్న బస్సు రైలింగ్‌ను ఢీకొని రోడ్డు పక్కకు పడిపోయింది.
ఈ ప్రమాద సమయంలో బస్సులో 15 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో ఆరుగురికి గాయాలు అయ్యాయి. గాయపడ్డ వారిని డీఆర్డీవో అపోలో మరియు హయత్ నగర్ ఆస్పత్రుల్లో తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం, మలుపులో డ్రైవర్ అప్రమత్తం కాకపోవడం ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.


















