కర్నూలులో నిజంగానే రోడ్లు దొంగల బారినపడ్డాయి! అవును… మీరు విన్నది నిజమే. సెప్టెంబర్ 16న ప్రధాని మోదీ పర్యటన కోసం కోట్ల రూపాయలతో వేసిన రోడ్ల నుంచి కంకర, వెట్‌మిక్స్‌ను దొంగలు తవ్వి తీసుకెళ్తున్నారు. నన్నూరు టోల్‌గేటు దగ్గర పాలు పంచినట్టు రహదారిని తవ్వేసి, తీసిన కంకర పక్కనే కుప్పలుగా పోశారు.



















