అమరావతి: గాంధీ అనుసరించిన శాంతియుత ప్రతిఘటన, సహాయ నిరాకరణ ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా స్ఫూర్తిగా నిలిచిందని గవర్నర్ అబ్దుల్ నజీర్ తెలిపారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సందేశం ఇచ్చారు. ‘మహాత్మాగాంధీ నిరాడంబర జీవితం గడిపారు, సత్యం, అహింసలను జీవన విధానంగా పాటించారు. మనం అందరం గాంధీజీ అడుగుజాడల్లో నడుస్తూ ఆయన సిద్ధాంతాలకు పునరంకితమవుదాం’ అని గవర్నర్ పేర్కొన్నారు – గవర్నర్ అబ్దుల్ నజీర్


















