పుట్టపర్తి: సీఎం చంద్రబాబునాయుడితో కలిసి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పుట్టపర్తి చేరుకున్నారు. మంత్రి లోకేష్‌కు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు ఘనస్వాగతం తెలిపారు. ఇంకా కొద్దిసేపట్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకోనున్నారు.రాష్ట్రపతిని స్వాగతం పలకడానికి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ సిద్ధంగా ఉన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతజయంతి వేడుకలు ప్రశాంతి నిలయంలో నిర్వహించబడుతున్నాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో పాటు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పాల్గొననున్నారు.






















