దావోస్, 2026 – వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) సమావేశాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ దావోస్‌లో వరుసగా కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జపాన్‌కు చెందిన ప్రముఖ రీన్యువబుల్ ఎనర్జీ సంస్థ జెరా గ్లోబల్ (JERA Global) సీఈవో యుకియో కానితో మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
ఈ సమావేశంలో మంత్రి నారా లోకేష్, జపాన్‌తో పాటు ఇతర ఆసియా మార్కెట్లకు లో-కార్బన్ గ్రీన్ అమ్మోనియా సరఫరా చేసే హబ్‌గా ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేయాలనే ప్రభుత్వ దృక్పథాన్ని వివరించారు. ఇందుకోసం మూలపేట, కృష్ణపట్నం, కాకినాడ పోర్టుల ఆధునిక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను వినియోగించి, సమీప ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్న గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి కేంద్రాల్లో పెట్టుబడులు పెట్టాలని యుకియో కానిని మంత్రి ఆహ్వానించారు.
ఆంధ్రప్రదేశ్‌లో పోర్ట్-లెడ్ డెవలప్‌మెంట్, గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ఫ్యూయల్స్, ఇండస్ట్రియల్ కారిడార్స్ ద్వారా పెట్టుబడిదారులకు అనుకూలమైన వాతావరణం ఉందని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఈ పెట్టుబడులు రాష్ట్రానికి ఉద్యోగ అవకాశాలు, ఎగుమతుల పెరుగుదల, గ్రీన్ ఎనర్జీ రంగంలో గ్లోబల్ గుర్తింపు తీసుకొస్తాయని తెలిపారు.


















