మన్యం జిల్లా పాచిపెంటలో మంత్రి సంధ్యారాణి తుపాను ప్రభావంపై సమీక్ష నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయంలో జిల్లా, మండల స్థాయి అధికారులతో సమావేశమై పరిస్థితులను ఆరా తీశారు. గ్రామ స్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆమె ఆదేశించారు.
మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ అత్యవసర వనరులు, రక్షణ బృందాలు, వైద్య సేవలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పెద్దగెడ్డ జలాశయాన్ని సందర్శించి నీటిమట్టాలు, గేట్ల నియంత్రణపై సమీక్షించారు.
ప్రాజెక్టు పరిధిలోని గ్రామాల భద్రత, తక్కువ ప్రాంతాల పరిస్థితులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆమె సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రి సంధ్యారాణి స్పష్టం చేశారు.




















