మిచిగాన్ రాష్ట్రం, హడ్సన్‌విల్ సమీపం – భారీ మంచు తుపానుకు కారణంగా ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. I-196 హైవేపై గంటకు 40 మైళ్ల వేగంతో గాలులు వీయడం మరియు రోడ్లపై మంచు పేరుకుపోవడం వల్ల 100కి పైగా కార్లు, ట్రక్కులు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి.ప్రాణనష్టం లేకుండా 12 మందికి మాత్రమే స్వల్ప గాయాలు సంభవించాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం సహాయక చర్యలు చేపట్టడానికి రహదారిని 10 మైళ్ల మేర మూసివేశారు.


















