తేజ సజ్జా, మంచు మనోజ్ ప్రధాన పాత్రల్లో కార్తిక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఫాంటసీ అడ్వెంచర్ ‘మిరాయ్’. ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం జియో హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఇది అందుబాటులోకి వచ్చింది. ఓటీటీలో ఈ మూవీకి మంచి క్రేజ్ ఉంది.

ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ వార్ 2. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. బాక్సాఫీస్ దగ్గర ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినా, ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నట్లు సోషల్‌మీడియా పోస్టులు దర్శనమిస్తున్నాయి.

సత్యరాజ్, ఉదయభాను ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’ (Tribanadhari Barbarik). మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టులో విడుదలైంది. అక్టోబర్ 10 నుంచి సన్ నెక్ట్స్‌తో (SunNXT) పాటు, అమెజాన్ ప్రైమ్ వీడియోలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళ భాషల్లో ఇది అందుబాటులోకి వచ్చింది.

ప్రస్తుతం యానిమేషన్ సిరీస్‌ల హవా నడుస్తోంది. ఇటీవల థియేటర్ ‘మహావతార నరసింహ’ అలరించింది. అదే స్థాయిలో నెట్‌ఫ్లిక్స్ తీసుకొచ్చిన వెబ్ సిరీస్ ‘కురుక్షేత్ర’. మహాభారత యుద్ధం నేపథ్యంలో సాగే సిరీస్ ఇది. తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లిష్ భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

నైనా అనే అమ్మాయి హత్య, దాని చుట్టూ సాగే ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ‘సెర్చ్: ది నైనా మర్డర్ కేస్’ జియో హాట్‌స్టార్ వేదికగా తెలుగు, హిందీ సహా ఇతర భాషల్లో ఈ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.




















