ఇజ్రాయెల్-హమాస్‌ల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలో శాంతి ఒప్పందం కుదిరిన తరువాత, గాజాలో (Gaza) పాక్ (Pakistan) తన సైనికులను మోహరించడానికి సిద్ధమవుతోంది. ఈ మిషన్ అంతర్జాతీయ శాంతి దళాల (ISF) భాగంగా ఉండనుంది.
ఇటీవల పాక్ ఆర్మీచీఫ్ జనరల్ ఆసిం మునీర్, ఇజ్రాయెల్ మొసాద్ మరియు యూఎస్ సీఐఏ సీనియర్ అధికారుల మధ్య రహస్య సమావేశాలు జరిగాయి. ఈ క్రమంలో, దాదాపు 20,000 మంది పాక్ సైనికులను గాజాకు మోహరించాలన్న నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఇస్లామాబాద్ నుండి అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది.
పాక్ సైనికులు గాజాలో భద్రత, మానవతా సహాయం మరియు పునర్నిర్మాణ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వీరు హమాస్ ఆయుధాలను సీన్‌చేసి, సరిహద్దుల్లో భద్రత నిర్వహణ బాధ్యతలు కూడా తీసుకుంటారు.
వ్యూహాత్మక ప్రమాణం: బఫర్ ఫోర్స్‌గా పాక్
అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, పాక్ సైనికులు ఇజ్రాయెల్ మరియు గాజాలోని మిగిలిన మిలిటెంట్ గ్రూప్‌ల మధ్య బఫర్ ఫోర్స్‌గా పనిచేస్తారు. దీనికి ప్రతిగా, ఇజ్రాయెల్, అమెరికా పాక్‌కు ఆర్థిక ప్రోత్సాహాలు ఇవ్వనున్నట్లు సమాచారం.
ఇజ్రాయెల్ మీడియా విశ్లేషణల ప్రకారం, పాక్ మోహరింపు సున్నితమైన దళచర్య అయినప్పటికీ, వ్యూహాత్మకంగా ప్రయోజనాన్ని అందించే అవకాశం ఉంది. ఐక్యరాజ్యసమితి శాంతి కార్యకలాపాలకు ఎక్కువ మంది దళాలను అందించే దేశాల్లో పాక్ ఒకటి. ఇప్పటికే ఆఫ్రికా, ఆసియా ఖండాలలో ఐరాస కార్యకలాపాలకు 2 లక్షల మందికి పైగా పాక్ సైనికులను మోహరించింది.




















