ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ అంతిమ యాత్ర లాలాపేట్ జయశంకర్ స్టేడియం నుంచి ప్రారంభమైంది. తార్నాక, ఉప్పల్ మార్గంగా ఘట్‌కేసర్‌లోని ఎన్‌ఎఫ్‌సీ నగర్ వరకు అంతిమ యాత్ర కొనసాగనుంది. మధ్యాహ్నం 12 నుంచి 1 గంట మధ్య అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, పలువురు మంత్రులు, ప్రముఖులు హాజరుకానున్నారు. సోమవారం ఉదయం అందెశ్రీ గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు.


















