హైదరాబాద్‌లో నిర్వహించిన ఇండియన్ సూపర్ క్రాస్ రేసింగ్ లీగ్ భారీ ఉత్సాహంతో సాగింది. ఈ వేడుకలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ పాల్గొని అభిమానులను అలరించారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సల్మాన్ ప్రత్యేకంగా కలుసుకున్నారు.రేసింగ్ క్రీడల అభివృద్ధి, యువతలో స్పోర్ట్స్ స్పిరిట్ పెంపు, అంతర్జాతీయ ఈవెంట్లకు హైదరాబాద్ వేదిక కావడం పట్ల ఇద్దరూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం నగరానికి మరో ప్రతిష్టాత్మక క్షణంగా నిలిచింది.


















