ఈరోజు (01-11-2025)
మీ రంగంలో అనుకూల ఫలితాలు పొందుతారు. కొత్త కార్యక్రమాలు ప్రారంభించేందుకు ఇది అనుకూలమైన సమయం. మనసుకు సంతృప్తి నిచ్చే పరిణామాలు చోటు చేసుకుంటాయి. మీ కృషికి తగిన ఫలితం లభిస్తుంది. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన శ్రేయస్సును, శుభఫలితాలను అందిస్తుంది.
ఈ వారం (26-10-2025 – 01-11-2025)
మీ కృషి ఫలితాలను ఇస్తుంది. మీరు ప్రారంభించిన పనులు సాఫీగా కొనసాగుతాయి. ఉద్యోగంలో ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. ఆర్థికపరంగా లాభదాయక పరిస్థితులు ఏర్పడతాయి. వ్యాపారంలో కొత్త అవకాశాలు లభిస్తాయి. సృజనాత్మక ఆలోచనలతో ముందుకు సాగితే మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. దుర్గామాత స్మరణ మంగళప్రదం.




















