ఇంటర్నెట్ డెస్క్: నటుడు అల్లు శిరీష్ శుభవార్త చెప్పారు. నయనిక అనే అమ్మాయితో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు తెలిపారు. ఈ నెల 31న తమ నిశ్చితార్థం జరగనున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
‘‘మా తాత అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా.. నా మనసుకు బాగా దగ్గరైన విషయాన్ని మీతో పంచుకుంటున్నా. నేను, నయనిక ఈ నెల 31న నిశ్చితార్థం చేసుకోబోతున్నాం. నేను పెళ్లి చేసుకోవాలని.. మా నానమ్మ ఎప్పుడూ కోరుతుండేది. ప్రస్తుతం ఆమె మా మధ్య లేకపోయినా.. తన ఆశీస్సులు మాపై ఉంటాయి’’ శిరీష్ ప్రకటనలో పేర్కొన్నారు. కాబోయే భార్యతో ఈఫిల్ టవర్ వద్ద దిగిన ఫొటోను పంచుకున్నారు.
పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నయనిక హైదరాబాద్‌కు చెందిన అమ్మాయి అని సమాచారం. గతేడాది ‘బడ్డీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు శిరీష్.




















