ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

ఫ్యాషన్‌ గురించి నేనెందుకు పట్టించుకోకూడదు?

October 1, 2025
in Entertainment News
0
ఫ్యాషన్‌ గురించి నేనెందుకు పట్టించుకోకూడదు?
Share on FacebookShare on TwitterShare on Whatsapp

ఎదుగుతున్నప్పుడు విన్న మాటలే తనని బలంగా మార్చాయని అంటోంది బాలీవుడ్‌ తార భూమి పెడ్నేకర్‌. ‘టాయిలెట్‌: ఏక్‌ ప్రేమ్‌ కథా’, ‘భక్షక్‌’ లాంటి  శక్తిమంతమైన కథల్ని ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకుల్ని అలరిస్తున్న కథానాయికీమె. ఈ ఏడాది ప్రారంభంలోనే ‘ది రాయల్స్‌’ సిరీస్‌తో ఓటీటీ వేదికగా సందడి చేసిన ఈమె.. ఎంచుకునే చిత్రాలే తనలోని మార్పుకు  కారణమని చెప్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న భూమి.. తన సినీ ప్రయాణం, బాల్యం గురించి కొన్ని ఆసక్తికర విషయాల్ని పంచుకుంది. 

‘‘చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి పదేళ్లు పూర్తయ్యాయి. నేను  యశ్‌ రాజ్‌ ఫిల్మ్‌ రూపొందించిన ‘దమ్‌ లగా కే హైసా’తో టీనేజర్‌గా ఉన్నప్పుడే సినీ ప్రయాణాన్ని ప్రారంభించాను. బాలీవుడ్‌లో పెద్ద హీరోయిన్‌ కావాలని కలలు కన్నా. మొదట్లో గుర్తింపు, అవకాశాల కోసం ఎదురుచూశా. కానీ నేడు నేను కోరుకున్నవన్నీ సాధించా. ఒక నటిగా చాలా అభివృద్ధి సాధించాను. నా తొలి సినిమా ప్రభావం, ఉనికిని నేను ఇప్పటికీ మర్చిపోలేను. ఇదే నన్ను ప్రేక్షకులకు దగ్గర చేసింది. ఆ సమయంలోనే సినిమా చాలా శక్తిమంతమైన సాధనమని గ్రహించా. నా కళతో సినీప్రియుల్లో స్ఫూర్తి నింపాలనుకున్నా. అందుకే ‘భక్షక్‌’, ‘సోంచిరియా’, ‘బధాయి దో’ లాంటి కథల్ని ఎంపిక చేసుకున్నా. ఇవి మహిళ గౌరవం, జర్నలిజం లాంటి ఇతివృత్తాలను అన్వేషించాయి. ఈ పదేళ్లు ప్రతి క్షణం నా కల కోసం బతికాను. మరిన్ని వైవిధ్యమైన కథలతో నా చివరి శ్వాస వరకూ నటిస్తూనే   ఉండాలని కోరుకుంటున్నా’’.

అది నా వ్యక్తిగత నిర్ణయం

‘‘సినీ రంగంలోకి రావడం వల్ల జీవితంలో ఎన్నో కొత్త విషయాలు జరిగాయి. గత రెండేళ్లుగా నా కెరీర్‌ ఇంకా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ధైర్యంగా, సినిమాను దాటి మాట్లాడే అవకాశం దొరికింది. నాకు ఇది చాలా పెద్ద మార్పు. తొలినాళ్లలో నా వృత్తి కారణంగా కొన్ని నియమాలను పాటించేదాన్ని. ఇప్పుడు ఎందుకో నేను ఫ్యాషన్‌ పట్ల చాలా ఉత్సాహంగా ఉన్నా. ‘‘ఆమె ఎందుకు అంత కష్టపడుతోంది. ఆమె చాలా మంచి నటి. ఫ్యాషన్‌ గురించి ఎందుకు పట్టించుకోవాలి..’’ అంటూ ఈ మధ్య కొంత మంది సామాజిక మాధ్యమాల్లో నాపై కామెంట్లు చేస్తున్నారు. కానీ నేను ఎందుకు ఫ్యాషన్‌ గురించి పట్టించుకోకూడదు? ఏం చేయాలో, చేయకూడదో అనేది నా వ్యక్తిగత నిర్ణయం. ఫ్యాషన్‌ అనేది నా ప్రతిభను ప్రపంచానికి చెప్పడానికి ఓ గొప్ప మార్గం. ఇటీవల సొంతంగా కొన్ని బ్రాండ్‌లను కూడా ప్రారంభించడంతో మరో కొత్త అధ్యాయానికి కూడా నాంది పలికాను’’. 

ఎగతాళి, వెక్కిరింపులే ఎక్కువ 

‘‘నన్ను ఎవరైనా నువ్వు ఇది చేయలేవు.. నీ వల్ల కాదు అంటే నన్ను నేను సవాలు చేసుకొని రంగంలోకి దిగుతా. బాల్యం నుంచి ఇలాంటి మాటలే వింటూ పెరిగా. చాలా సందర్భాల్లో నన్ను ‘ఏంటి ఆమె నటి అవుతుందా?’ అని ఎగతాళి చేసేవారు. వెక్కిరించేవారు. కానీ అవేమీ నాపై ప్రభావం చూపించలేదు. అనుకున్నట్లుగానే నేను ఒక అద్భుతమైన ఫిల్మ్‌ స్టూడియోలో కాస్టింగ్‌ విభాగంలో అడుగుపెట్టాను. అక్కడే ఎంతో కష్టపడి అన్నీ నేర్చుకున్నా. ఈ ప్రయాణంలో నాకు ఆ దేవుడే అండగా ఉన్నాడేమో అనిపిస్తుంది. ‘దమ్‌ లగా కే హైసా’ చిత్రంలో నటించడం నాకో గొప్ప అవకాశం. నా కలలకు దారి చూపించిందీ సినిమా’’.

వీటిని పట్టించు కోకపోతేనే.. ప్రశాంతత

‘‘నటీనటులందరు సోషల్‌ మీడియాలో విమర్శలు ఎదుర్కోవడం ఈరోజుల్లో సాధారణం అయిపోయింది. దీన్ని ట్రోలింగ్, బెదిరింపు.. ఇలా మీరు దానిని ఏ విధంగా పిలిచినా.. మనం దానికి అలవాటు పడ్డాం అనేది మాత్రం నిజం. కానీ మహిళల్ని లక్ష్యంగా చేసుకున్నప్పుడు దానిని ఎలా ఎదుర్కోవాలో ఇప్పటికీ నాకు తెలియదు. ఈ విషయంలో ధైర్యంగా లేకపోయినా.. కచ్చితంగా వాటిని తట్టుకొని నిలబడగలనని తెలుసు. మనం సోషల్‌ మీడియా ఆధిపత్యం చెలాయిస్తున్న ప్రపంచంలో జీవిస్తున్నాం. ఎంతో మంది వారి అభిప్రాయాలను మనపై రుద్దుతుంటారు. వాటిని అంతగా పట్టించుకోకపోతేనే.. ప్రశాంతంగా ఉండొచ్చనేది నా అభిప్రాయం’’. 

ShareTweetSend
Previous Post

కరెంట్‌ అఫైర్స్‌

Next Post

శుభవార్త చెప్పిన అల్లు శిరీష్‌.. నిశ్చితార్థం ఆరోజే

Related Posts

"షూటింగ్ కంటే పాపతో ఆటలే ఇష్టం.. తండ్రి అయ్యాక మారిన రాజ్‌కుమార్ ప్రాధాన్యతలు"
Movies

“షూటింగ్ కంటే పాపతో ఆటలే ఇష్టం.. తండ్రి అయ్యాక మారిన రాజ్‌కుమార్ ప్రాధాన్యతలు”

April 20, 2026
"బ్యాంకు దొంగగా ధనుష్ 'కర': ఉత్కంఠ రేపుతున్న ట్రైలర్!"
Movies

“బ్యాంకు దొంగగా ధనుష్ ‘కర’: ఉత్కంఠ రేపుతున్న ట్రైలర్!”

April 20, 2026
"నటిని కాకుంటే ముగ్గురు పిల్లలతో ఉండేదాన్ని: దీపికా పాత మాటలు ఇప్పుడు వైరల్!"
Movies

“నటిని కాకుంటే ముగ్గురు పిల్లలతో ఉండేదాన్ని: దీపికా పాత మాటలు ఇప్పుడు వైరల్!”

April 20, 2026
యాక్షన్ జాతర మొదలు: ‘ఫోర్స్ 3’ రిలీజ్ డేట్ ఫిక్స్.. బాక్సాఫీస్ వద్ద జాన్ అబ్రహం వేట!
Movies

యాక్షన్ జాతర మొదలు: ‘ఫోర్స్ 3’ రిలీజ్ డేట్ ఫిక్స్..బాక్సాఫీస్ వద్ద జాన్ అబ్రహం వేట!

April 16, 2026
మీరా జాస్మిన్‌తో మళ్ళీ సిల్వర్ స్క్రీన్ మ్యాజిక్: ‘అతిమనోహరం’ టైటిల్ వెనుక సీక్రెట్ ఏంటి?
Movies

మీరా జాస్మిన్‌తో మళ్ళీ సిల్వర్ స్క్రీన్ మ్యాజిక్: ‘అతిమనోహరం’ టైటిల్ వెనుక సీక్రెట్ ఏంటి?

April 16, 2026
రుక్మిణి ప్లేస్‌లో సారా.. ధనుష్ 56వ చిత్రంలో అనూహ్య మలుపు!
Movies

రుక్మిణి ప్లేస్‌లో సారా.. ధనుష్ 56వ చిత్రంలో అనూహ్య మలుపు!

April 16, 2026
Next Post
శుభవార్త చెప్పిన అల్లు శిరీష్‌.. నిశ్చితార్థం ఆరోజే

శుభవార్త చెప్పిన అల్లు శిరీష్‌.. నిశ్చితార్థం ఆరోజే

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
పంచాంగం: 03 ఆగస్టు 2026 (ఆదివారం)

పంచాంగం: 04 ఆగస్టు 2026 (మంగళవారం)

August 4, 2026
ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేశాం: మంత్రి అనిత

ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేశాం: మంత్రి అనిత

October 3, 2025
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
భారీ వర్షాలతో జలకళ.. ఉరకలేస్తున్న డుడుమ జలపాతం

భారీ వర్షాలతో జలకళ.. ఉరకలేస్తున్న డుడుమ జలపాతం

August 4, 2026
బాంకీపూర్‌ ఉప ఎన్నిక ఫలితం తర్వాత మోదీ-నితీశ్‌ భేటీ

బాంకీపూర్‌ ఉప ఎన్నిక ఫలితం తర్వాత మోదీ-నితీశ్‌ భేటీ

August 4, 2026
తిరుమలలో బ్రహ్మోత్సవాల సందడి.. తొమ్మిది రోజుల పాటు సేవలు రద్దు

తిరుమలలో బ్రహ్మోత్సవాల సందడి.. తొమ్మిది రోజుల పాటు సేవలు రద్దు

August 4, 2026
శిర్డీ సాయికి దుబాయ్‌ భక్తుల బంగారు కానుక

శిర్డీ సాయికి దుబాయ్‌ భక్తుల బంగారు కానుక

August 4, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

భారీ వర్షాలతో జలకళ.. ఉరకలేస్తున్న డుడుమ జలపాతం

భారీ వర్షాలతో జలకళ.. ఉరకలేస్తున్న డుడుమ జలపాతం

August 4, 2026
బాంకీపూర్‌ ఉప ఎన్నిక ఫలితం తర్వాత మోదీ-నితీశ్‌ భేటీ

బాంకీపూర్‌ ఉప ఎన్నిక ఫలితం తర్వాత మోదీ-నితీశ్‌ భేటీ

August 4, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.