టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) గురించి సోషల్ మీడియాలో ఒక హాట్ టాపిక్ చర్చనీయాంశంగా మారింది. దాదాపు 80,000 ఉద్యోగులను కంపెనీ తొలగించిందనే వార్తలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ విషయం నిజమేనా, కంపెనీ ఏం చెప్పిందనే విషయాలను ఇప్పుడు చూద్దాం.టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)లో ఉద్యోగాల తొలగింపు గురించి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. ఆ పోస్ట్‌లో టీసీఎస్ దాదాపు 80,000 మంది ఉద్యోగులను తొలగించిందన్నారు (TCS Laying Off). ఆ క్రమంలో కొందరికి 18 వేల జీతం ఇవ్వగా, మరికొందరికి 3 నెలల జీతం, ఇంకొందరికి ఎలాంటి ప్యాకేజీ లేకుండా తొలగించిందని పేర్కొన్నారు. ఆ పోస్ట్ నెట్టింట వెరల్ అవుతున్న నేపథ్యంలో అది నిజమేనా? టీసీఎస్ నిజంగా ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించిందా అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.





















