సోషల్ మీడియా వేదికలైన వాట్సప్, ఫేస్‌బుక్ ద్వారా పెరుగుతున్న సైబర్ మోసాలను అరికట్టేందుకు మెటా కొత్త చర్యలు చేపట్టింది. యూజర్లను కేటుగాళ్ల నుంచి రక్షించేందుకు యాంటీ స్కామ్ టూల్స్ (Anti-Scam Tools) ను ప్రవేశపెట్టింది. ఈ టూల్స్ వాట్సప్, ఫేస్‌బుక్, మెసెంజర్ యాప్‌లలో పనిచేస్తూ అనుమానాస్పద చర్యలను గుర్తించి యూజర్లకు ముందుగానే హెచ్చరికలు ఇస్తాయి.
వాట్సప్‌లో కొత్త భద్రత
వాట్సప్‌లో ఎక్కువగా జరిగే మోసాల్లో డివైజ్ లింకింగ్ ఫీచర్ దుర్వినియోగం ప్రధానంగా ఉంది. ఈ ఫీచర్ ద్వారా సైబర్ నేరగాళ్లు యూజర్ల అకౌంట్లను తమ అధీనంలోకి తీసుకుని వారి వ్యక్తిగత సందేశాలను చదవడం, వారి పేరుతో డబ్బులు అడగడం లేదా గ్రూపుల్లో అనుమానాస్పద ఫైల్స్ పంపించడం వంటి చర్యలు చేస్తున్నారు.
ఇలాంటి మోసాలను అరికట్టేందుకు వాట్సప్‌లో కొత్త భద్రతా ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఎవరైనా అనధికారికంగా లింక్ డివైజ్ చేయడానికి ప్రయత్నిస్తే, చివరి దశలో “ఇది స్కామ్ కావచ్చు” అని అలర్ట్ చూపిస్తుంది. యూజర్లు “Don’t Link” అనే ఆప్షన్‌ను ఎంచుకుని ఆ ప్రక్రియను నిలిపివేయవచ్చు.
ఫేస్‌బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్‌లలో మోసాలు
ఫేస్‌బుక్‌లో కూడా మోసాలు పెరుగుతున్నాయి. కొన్నిసార్లు ఫ్రెండ్ లిస్ట్‌లో ఉన్న వ్యక్తుల పేరుతోనే మరో కొత్త ఖాతా నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు వస్తుంటాయి. చాలా మంది మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉండటంతో నమ్మి ఆ రిక్వెస్ట్‌ను అంగీకరిస్తారు. తర్వాత అత్యవసర పరిస్థితి పేరుతో డబ్బులు అడగడం వంటి మోసాలు జరుగుతుంటాయి.
ఈ సమస్యను నివారించేందుకు మెటా కొత్త ఏఐ ఆధారిత టూల్ ను ప్రవేశపెట్టింది. అనుమానాస్పద ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఆ ఖాతా గురించి ముఖ్యమైన వివరాలను యూజర్లకు చూపిస్తుంది. ఉదాహరణకు — ఆ ఖాతా ఎక్కడి నుంచి పని చేస్తోంది, ఎన్ని రోజుల క్రితం సృష్టించబడింది, మ్యూచువల్ ఫ్రెండ్స్ ఎవరు వంటి వివరాలను తెలియజేస్తుంది.అలాగే ఫేస్‌బుక్ మెసెంజర్‌లో కొత్త అకౌంట్ల నుంచి వచ్చే సందేశాలపై కూడా యూజర్లను అప్రమత్తం చేస్తుంది.మొత్తానికి, పెరుగుతున్న సైబర్ మోసాలను ఎదుర్కొనేందుకు మెటా తీసుకొచ్చిన ఈ కొత్త భద్రతా టూల్స్ యూజర్లకు మరింత రక్షణను అందించనున్నాయి
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















