తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్‌లోకి హ్యాకింగ్ జరిగింది. ఆర్డర్ కాపీలు డౌన్‌లోడ్ చేసుకుంటూ ఉండగా, PDF ఫైల్స్‌కి బదులుగా “BDG SLOT” అనే ఆన్‌లైన్ బెట్టింగ్ సైట్ తెరుచుకోవడం గమనించబడింది. ఈ ఘటనపై హైకోర్టు రిజిస్ట్రార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైమ్ శాఖ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది.




















