రాష్ట్రంలో ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేసేందుకు ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ పేరుతో 99 రోజుల ప్రత్యేక కార్యాచరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని శుక్రవారం నుంచి ప్రారంభించి జూన్ 12 వరకు నిర్వహించనుంది. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఐదు అంచెల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది.
గ్రామ, వార్డు సభలు నిర్వహిస్తూ ప్రజల సమస్యలు స్వీకరించడం, ప్రభుత్వ పథకాల అమలుపై అవగాహన కల్పించడం, అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందించడం వంటి కార్యక్రమాలు ఇందులో భాగంగా ఉంటాయి. మండలాలు, పట్టణాలు, నియోజకవర్గ కేంద్రాల్లో వివిధ శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక స్టాళ్లు, ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేసి ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు వివరించనున్నారు.
ప్రభుత్వం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ మేళాలు నిర్వహించనుంది. ఈ మేళాల ద్వారా లక్ష మంది యువతకు ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే మహిళా సాధికారతను బలోపేతం చేసే దిశగా అన్ని జిల్లాల్లో ‘ఇందిరా మహిళాశక్తి’ భవనాలను ప్రారంభించనున్నారు.
అదేవిధంగా గృహరహిత పేదలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు అర్హులైన కుటుంబాలకు రేషన్‌కార్డుల పంపిణీని నిరంతర ప్రక్రియగా కొనసాగించనున్నారు. యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించే ప్రత్యేక కార్యక్రమాలు కూడా ఈ 99 రోజుల ప్రణాళికలో భాగంగా చేపట్టనున్నారు.
ఇప్పటికే రెండు దఫాలుగా నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం నేరుగా ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించిందని అధికారులు తెలిపారు. ఈసారి కూడా అదే విధంగా ప్రజల అభిప్రాయాలు, సూచనలు సేకరించి పాలనలో అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ముఖ్య కార్యక్రమాలు
రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సభలు
అన్ని జిల్లాల్లో ఉద్యోగ మేళాలు – లక్ష మందికి ఉద్యోగాలు
ఇందిరా మహిళాశక్తి భవనాల ప్రారంభం
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్ల మంజూరు
రేషన్‌కార్డుల పంపిణీని నిరంతర ప్రక్రియగా కొనసాగింపు
వారాల వారీ ప్రత్యేక కార్యక్రమాలు
మార్చి 30 – ఏప్రిల్ 4: గ్రామీణాభివృద్ధి
ఏప్రిల్ 6 – 11: ఆరోగ్యరంగం
ఏప్రిల్ 13 – 18: అరైవ్ అలైవ్ కార్యక్రమం
ఏప్రిల్ 20 – 25: సంక్షేమ పథకాలు
ఏప్రిల్ 27 – మే 2: పిల్లల భద్రత, డ్రగ్స్ నివారణ
మే 4 – 9: రైతు సంక్షేమం
మే 11 – 16: విద్యా రంగంమే 18 – 23: యువత, క్రీడలు
మే 25 – 30: మహిళా సంక్షేమం
జూన్ 1 – 6: పర్యావరణ పరిరక్షణ
ఈ 99 రోజుల కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పథకాలు ప్రజలకు మరింత చేరువ కావడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన పెంచడం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















