ఈ ఫలితాలు ఇండియా కూటమితో సహా అందరికీ పాఠమంటూ విజేత నీతీశ్‌కుమార్కు అభినందనలు, పోరాడిన తేజస్వీ యాదవ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. సంక్షేమాలు, సామాజిక, సైద్ధాంతిక సంకీర్ణాలు, స్థిరమైన ప్రచారంపైనే ఎన్నికల ఫలితాలు ఆధారపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇండియా కూటమిలో అనుభవజ్ఞులు ఉన్నారని, భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కోవడానికి వ్యూహాత్మక ప్రణాళిక వేయగలరని విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే, ఈ ఫలితాల సందర్భంలో ఎన్నికల కమిషన్ (ఈసీ) ప్రతిష్ట దిగజారిపోయిందని, ఈసీపై వచ్చిన ఆరోపణలను కొట్టిపారేయలేమని, ఓడిపోయిన అభ్యర్థుల్లో కూడా విశ్వాసాన్ని ప్రేరేపించేలా ఈసీ వ్యవహరించాలని స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 245 సీట్లకు గాను ఎన్డీయే 202 సీట్లను గెలుచుకోగా, మహాగఠ్‌బంధన్ 34 సీట్లకే పరిమితమైంది.




















