హిట్ వెబ్‌సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’ ట్రైలర్ విడుదలైంది. మనోజ్ బాజ్‌పాయ్ నటించిన ఈ సిరీస్‌ను రాజ్ అండ్ డీకే రూపొందించారు. శ్రీకాంత్ తివారీగా మనోజ్ బాజ్‌పాయ్ మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ సీజన్ నవంబర్ 21 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. శ్రీకాంత్ తివారీ రాక ఖాయమైంది!
విజయవంతమైన వెబ్‌సిరీస్‌లలో ఒకటైన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ మూడో సీజన్ 3 కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మనోజ్ బాజ్‌పాయ్ ముఖ్యపాత్రలో నటించిన ఈ సిరీస్‌ను రాజ్ అండ్ డీకే తెరకెక్కించారు. ఈ నేపథ్యంలో, తాజాగా విడుదలైన ఈ సిరీస్ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సీజన్ నవంబర్ 21 నుండి అమెజాన్ ప్రైమ్ వేదికగా అందుబాటులోకి రానుంది.




















