మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు సుకుమార్ రూపొందించనున్న కొత్త సినిమా ప్రస్తుతం టాలీవుడ్‌లో ఆసక్తికర చర్చలకు దారి తీస్తోంది. తాత్కాలికంగా ‘RC17’గా పిలుస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇటీవల వచ్చిన కొన్ని వ్యాఖ్యలు అభిమానుల్లో సందేహాలు కలిగించాయి. అయితే తాజాగా ఆ వ్యాఖ్యలపై దర్శకుడు హుస్సేన్ షా కిరణ్ స్పష్టత ఇచ్చారు.
ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా రామ్ చరణ్ సినిమా కోసం రెండు కథలు రాస్తున్నామని ఆయన చెప్పడంతో, ఈ ప్రాజెక్ట్ కథ ఇంకా ఫైనల్ కాలేదని.. సినిమా సెట్స్ పైకి రావడానికి మరింత సమయం పడుతుందనే ప్రచారం జరిగింది. ఈ వార్తలతో మెగా అభిమానుల్లో కొంత ఆందోళన కనిపించింది.
ఈ నేపథ్యంలో తాజాగా స్పందించిన హుస్సేన్ షా కిరణ్.. రెండు వేర్వేరు కథలు కాదని, ఒకే కథకు రెండు వేరియేషన్లు (వెర్షన్‌లు) సిద్ధం చేస్తున్నామని తెలిపారు. వాటిలో అత్యుత్తమంగా అనిపించిన దాన్ని ఎంపిక చేసి సినిమా రూపుదిద్దుకుంటుందని చెప్పారు. RC17 చిత్రానికి సంబంధించిన కథ ఇప్పటికే పూర్తిగా లాక్ అయ్యిందని, సినిమా ఆలస్యం అవుతుందన్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే, గతంలో ‘రంగస్థలం’ వంటి భారీ బ్లాక్‌బస్టర్ ఇచ్చిన సుకుమార్ – రామ్ చరణ్ కాంబినేషన్ మళ్లీ కలవడంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం రామ్ చరణ్ దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ‘పెద్ది’ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews


















