విశాఖపట్నం, సింహాచలం :
దసరా సీజన్ రాగానే పశ్చిమ బెంగాల్ నుంచి విశాఖకు పెద్ద ఎత్తున బెంగాలీ పర్యాటకులు తరలి వస్తుంటారు. ముందుగా అప్పన్న స్వామిని దర్శించుకొని, అనంతరం నగరంలోని పర్యాటక ప్రదేశాలను సందర్శించడం వారిది సంప్రదాయం. గత వారం రోజులుగా సింహాచలం క్షేత్రం బెంగాలీ భక్తులతో賂డి పోతోంది.
కుటుంబాలతో కలిసి వచ్చిన వారు ఉపయోగించిన పర్యాటక బస్సులు స్థానికులను ఆకర్షిస్తున్నాయి. రంగురంగుల పెయింటింగ్‌లు, అద్భుతమైన అలంకరణలతో మెరిసిపోతున్న ఈ బస్సులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఒక బస్సుపై తెలుగు సినీ నటుడు బాలకృష్ణ నటించిన అఖండ సినిమా స్టిల్స్‌తో చేసిన అలంకరణ మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.
పాత గోశాల కూడలి నుంచి తొలిపావంచా వరకు పలు ప్రాంతాల్లో పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన బస్సులే కళకళలాడుతున్నాయి.


















